ఇర్వింగ్‌లో ఘనంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

17-08-2017

ఇర్వింగ్‌లో ఘనంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు

ఇర్వింగ్‌లో భారత స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను వైభవంగా జరిపారు. మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద జరిగిన వేడుకల్లో పలువురు భారతీయులు పాల్గొని జెండావందనం చేశారు. భారత- అమెరికా జెండాలు చేతబట్టుకుని భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. స్మారకస్థలి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బెంచీలను ఈ సందర్భంగా ప్రారంభించారు. నిర్వాహకులు ప్రసాద్‌ తోటకూర, రావు కల్వల తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.


Click here for Event Gallery