నాట్స్ “వసుదైవ కుటుంబం”

02-07-2017

నాట్స్ “వసుదైవ కుటుంబం”

తెలుగువారంతా సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని కాంగ్రెస్ మెన్ రాజా కృష్ణమూర్తి అన్నారు. శ్యాంబర్గ్ లో తెలుగువారు పండుగ చేసుకోవడం వారి ఐకమత్యాన్ని సూచిస్తుందని..ఇలాంటి సంబరాలతో సంస్కృతీ, సాంస్కృతిక సంబంధాలు బలపడతాయని శ్యాంబర్గ్ మేయర్ ఎ.ఎల్.లారన్స్ అన్నారు. “వసుదైవ కుటుంబం” నృత్యం ఆకట్టుకుంది. స్థానిక కళాకారులకు నృత్య ప్రదర్శన తర్ఫీదు ఇచ్చిన పెద్దుల నరసింగరావు, పెద్దుల శ్రీనివాస్, వేణులను, కూచిపూడి కళాకారిణి శోభా తమ్మన, భారత నాట్య కళాకారిణిని ఆషాల శిష్య బృందాలను సిలికానాంధ్ర వ్యవస్థాపకులు కూచిభొట్ల ఆనంద్, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అభినందించారు. ఆధ్యాత్మికవేత్తలు విశ్వయోగి విశ్వంజీ, చిన్మయ సేవా ట్రస్ట్ ఆధ్యాత్మిక గురువులు చిదాత్మనందతో పాటు ఇషాత్మనంద ప్రబోధాలు నిర్వహించారు.