After Mitron Google takes down Remove China Apps also from Play Store

రిమూవ్‍ చైనా యాప్‍, మిత్రోన్‍ యాప్‍లను గూగుల్‍ తన ప్లేస్టోర్‍ నుంచి తొలగించివేసింది. చైనా నుంచి కరోనా వైరస్‍ వ్యాప్తితో పాటు సరిహద్దులో ఆ దేశ సైనికుల దుందుడుకు చర్యలతో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల కారణంగా దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్‍ బలపడింది. అదే సమయంలో రిమూవ్‍ చైనా యాప్‍ అందుబాటులోకి రావడంతో.. దేశంలో సుమారు 50 లక్షల మంది దాన్ని డౌన్‍లోడ్‍ చేసుకున్నారు.