liam-plunkett-michael-vaughan-phil-tufnell-bbc-england-usa

జాతీయ శిక్షణ శిబిరం కోసం ప్రకటించిన 55 మంది క్రికెటర్ల జాబితాలో తన పేరు లేకపోవడం.. ఈ విషయంపై టీమ్‍ మేనేజ్‍మెంట్‍ తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఇంగ్లండ్‍ వన్డే వరల్డ్ కప్‍ జట్టు సభ్యుడు ఫ్లంకెట్‍ ఆవేదన వ్యక్తం చేశాడు. జాబితాలో తన పేరు లేని విషయాన్ని ఫ్లంకెట్‍ ట్విట్టర్‍ ద్వారా తెలుసుకున్నాడు. ఒకవేళ ఏదైనా అవకాశముంటే అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తాను సిద్ధమేనని ఫ్లంకెట్‍ పేర్కొన్నారు. నా భార్య అమెరికన్‍. అక్కడ అత్యున్నత స్థాయిలో క్రికెట్‍ ఆడే అవకాశముంటే నేను సిద్ధమే. ఇంగ్లండ్‍లో చేయడానికి ఏం లేనప్పుడు అమెరికాకు ఎందుకు ఆడకూడదు? అని ఫ్లంకెట్‍ పేర్కొన్నాడు.