US to block Chinese airlines from flying into the US

చైనా విమానాల రాకపోకలకు అమెరికా అనుమతులు నిలిపి వేసింది. ఈ నెల 16 నుంచి నాలుగు చైనీస్‍ ఎయిర్‍లైన్స్ సంస్థలకు చెందిన విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్టు ఎయిర్‍లైన్స్ ట్రాన్స్పోర్టేషన్‍ డిపార్టుమెంట్‍ వివరించింది. చైనా లోని వుహాన్‍ ప్రావిన్స్లో కరోనా మహమ్మారి కారణంగా అమెరికాకు చెందిన యునైటెడ్‍ ఎయిర్‍లైన్స్, డెల్టా ఎయిర్‍లైన్స్లకు చెందిన విమానాల రాకపోకలను ఈ ఏడాది ప్రారంభంలో చైనా నిలిపివేసింది. ఈ వారంలో చైనా వాటిని పునరుద్ధరించ వలసి ఉన్నా ఆ పని జరగలేదు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా చైనా విమానాల రాకపోకలను రద్దు చేసింది.