Roger Federer Rafael Nadal and Novak Djokovic join BlackOutTuesday campaign against racial injustice

అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి క్రీడాలోకం నుంచి మద్దతు పెరుగుతున్నది. ఆఫ్రికన్‍-అమెరికన్‍ జార్జ్ ఫ్లాయిడ్‍ మృతికి పోలీసు కారణమవడంపై జరుగుతున్న ఆందోళనలకు టెన్నిస్‍ దిగ్గజాలు రోజర్‍ ఫెదరర్‍, నొవాక్‍ జకోవిచ్‍, రఫెల్‍ నాదల్‍ సంఘీభావం ప్రకటించారు. ముగ్గురు స్టార్లు ట్విట్టర్‍లో నలుపు రంగు ఫొటోలను పోస్ట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. కాగా అమెరికా యువ టెన్నిస్‍ సంచలనం గాఫ్‍ సైతం జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇటీవలే గళమెత్తింది. ఫార్ములా వన్‍ స్టార్‍ రేసర్‍ లూయిస్‍ హామిల్టన్‍, క్రికెటర్లు క్రిస్‍ గేల్‍, డారెన్‍ సామీ, శ్రీలంక దిగ్గజం సంగక్కర సహా మరి కొందరు క్రీడాకారులు జాత్యహంకార చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.