First lady Melania Trump asks everyone to protest in peace critics push back

అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ నిబంధనల్ని పాటించాలని, వీధుల్ని వదిలి ఇళ్లకు చేరాలని ఆ దేశ ప్రథమ పౌరురాలు మెలనియా ట్రంప్‍ కోరారు. శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలని వ్ఞిప్తి చేశారు. ఆఫ్రికన్‍- అమెరికన్‍ జార్జ్ ఫ్లాయిడ్‍ మృతికి వ్యతిరేకంగా అగ్రరాజ్యంలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పౌరులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కలిసి కట్టుగా పనిచేస్తేనే అన్ని నగరాల్లోని ప్రజలకు భద్రత కల్పించగలమని పేర్కొన్నారు. అంతకుముందు ఫ్లాయిడ్‍ కుటుంబం పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు.