trump-obrien-world-health-organization-corrupt

అవినీతి, చైనాపై ఆధారపడడం వంటి చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో) స్వస్తి పలకాలని అమెరికా జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఓబ్రియన్‍ అన్నారు. ఈ రెండు అంశాల విషయమంలో తాము చెప్పినట్లు చేస్తే డబ్ల్యూహెచ్‍వోలో మళ్లీ చేరే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. డబ్ల్యూహెచ్‍వోలో సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని చెప్పారు. చైనా చేతిలో డబ్ల్యూహెచ్‍వో కీలు బొమ్మలా మారిందని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‍ అన్నారు.