indian-american-aerospace-expert-vivek-lall-appointed-general-atomics-chief-executive

ప్రముఖ భారతీయ అమెరికన్‍ అంతరిక్ష, రక్షణ రంగ నిపుణుడు వివేక్‍ లాల్‍.. కాలిఫోర్నియాలోని శాన్‍ డీగో కేంద్రంగా ఉన్న జనరల్‍ అటామిక్స్ గ్లోబల్‍ కార్పొరేషన్‍ చీఫ్‍ ఎగ్జిక్యూటివ్‍గా నియమితులయ్యారు. ఈయన భారత్‍, అమెరికా మధ్య జరిగిన కొన్ని ప్రధాన రక్షణ ఒప్పందాల్లో కీలక పాత్ర వహించారు. లాల్‍ గత ఏప్రిల్‍లో అమెరికన్‍ సెక్యూరిటీ, ఏరో స్పేస్‍ దిగ్గజం లాక్‍హీడ్‍ మార్జిన్‍లో ఏరోనాటిక్స్ స్ట్రాటజీ అండ్‍ బిజినెస్‍ డెవలప్‍మెంట్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే కొన్ని వారాల వ్యవధిలోనే ఈయనకు జనరల్‍ అటామిక్స్ పదవి కట్టబెట్టింది.