americans thanks to Dr. Vidyasagargoud Marupakula

అమెరికాలో కరోనా వైరస్‍ విజృంభిస్తున్న తరుణంలో తన ప్రాణాలను లెక్క చేయకుండా సేవలందించిన డాక్టర్‍ మారుపాకల విద్యాసాగర్‍ గౌడ్‍కు అభినందనలు వెళ్శి విరిసాయని ఆయన స్నేహితుడు కె.బాలచంద్రన్‍ వెల్లడించారు. హైదరాబాద్‍లో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మహాబూబ్‍నగర్‍ జిల్లా వనపర్తికి చెందిన విద్యాసాగర్‍ గౌడ్‍ వరంగల్‍, కాకతీయ విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించిన అనంతరం అమెరికాలో ఎండి కోర్సును పూర్తి చేసి ఆరిజినా రాష్ట్రంలోని బ్యానర్‍హెల్త్ ఆసుపత్రిలో సీనియర్‍ సర్జన్‍గా రోగులకు సేవలందిస్తున్నారని తెలిపారు. మార్చి నెలలో కోవిడ్‍ 19 వైరస్‍ విజృంభించడంతో వైరస్‍ భారీన పడిన బాధితులకు సేవలందించేందుకు మానవత దృక్పథంతో భార్య ఇద్దరు పిల్లలను తన నివాసంలో ఉంచి ఆసుపత్రిలో ఉంటూ రెండు నెలల పాటు సేవలందించారని తెలిపారు. వృత్తి ధర్మం కోసం వ్యక్తిగత జీవితాన్ని వదులుకుని రోగులకు సేవలందించిన విద్యాసాగర్‍కు ఇటీవల అమెరికాలో పెద్ద ఎత్తున కార్ల ర్యాలీ నిర్వహించి ఆ దేశ ప్రజలు నీరాజనాలు పట్టారని ఆయన వెల్లడించారు.