spacex-nasa-docking-international-space-station/

అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్‍ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:22 గంటలకు లాంచ్‍ ప్యాడ్‍ 39ఏ నుంచి క్రూ డ్రాగన్‍ క్యాపూల్స్ను మోసుకెళ్లిన ఫాల్కన్‍ రాకెట్‍ 9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్‍ బెహంకన్‍ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్‍ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‍ఎస్‍) బయల్దేరింది. నింగిలోకి దూసుకెళ్లిన 19 గంటల తర్వాత ఐఎస్‍ఎస్‍కు చేరుకుంది. నలుపు తెలుపు రంగుల్లో బుల్లెట్‍ ఆకారంలో ఉన్న డ్రాగన్‍ కాప్స్యూల్‍ నింగికి ఎగరడానికి ముందు లైట్స్ లైట్‍ దిస్‍ క్యాండిల్‍ అంటూ వ్యోమగామి హార్లీ ఉద్నిగ్నంగా అరిచి చెప్పారు. ఇప్పటికే ఐఎస్‍ఎస్‍లో ఉన్న వ్యోమగాములతో వీరూ పనిచేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్‍ సెంటర్‍లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్‍ నేరుగా వీక్షించారు. స్పేస్‍ ఎక్స్ సీఈవో ఎలన్‍ మస్క్తో ట్రంప్‍ ముచ్చటించారు. ఆయనని ఒక మేధావి అంటూ ప్రశంసించారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసీ యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.