louisville-protest-shooting-breonna-taylor

పోలీసుల చేతుల్లో కాల్పులకు గురై మరణించిన బ్రియాన్న టేలర్‍కు మద్దతుగా కెంటకీ నగర వీధుల్లో 400 నుంచి 500 మంది నల్లజాతీయుల నిరసనలు జరిపారు. ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఏడుగురు  గాయాలపాలైనట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించి కొంత మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బ్రియన్నా టేలర్‍ ఇంట్లో మత్తుపదార్థాలు ఉన్నాయని పోలీసులు కాల్చి చంపినప్పటికీ, ఇంట్లో మాత్రం మత్తు పదార్థాలు దొరకలేదు. దీంతో అమెరికాలో నల్లజాతీయులపై తెల్ల జాతీయులు హింసకు పాల్పడుతున్నారంటూ నిరసనలు జరుగుతున్నాయి.