Major Suman Gawani to be honoured with UN Military Gender Advocate award

ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మకంగా అందించే మిలటరీ, జెండర్‍ అడ్వొకేట్‍ అవార్డు 2019 భారతీయ మేజర్‍ సుమన్‍ గవానికి దక్కింది. బ్రెజిల్‍కు చెందిన కమాండర్‍ కార్లా మాంటేరియోతో కలిపి సంయుక్తంగా ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆన్‍లైన్‍లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఐరాస సెక్రటరీ జనరల్‍ ఆంటోనియో గుటెర్రస్‍ వారిద్దరికీ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించారు. దక్షిణ సుడాన్‍లో ఐరాస శాంతి పరిరక్షణ దళంలో చేసిన సేవలకు గాను సుమన్‍ గవాని ఈ అవార్డుకు ఎంపికయ్యారు.