twitter-ceo-jack-dorsey-responds-after-trumps-post-on-big-action-against-microblogging-site

ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమలు చేస్తున్న మెయిల్‍ ఇన్‍ ఓటింగ్‍ పక్రియపై అదేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కోపం ఉన్నారు. ఈ పక్రియ ఎన్నికల రిగ్గింగ్‍కు దారితీస్తుందంటూ ఆయన చేసిన ట్వీట్‍ దుమారం రేపుతోంది. ఈ ట్వీట్‍ను ట్యాగ్‍ చేసిన ట్విట్టర్‍ మెయిల్‍ ఇన్‍ ఓటింగ్‍కు సంబంధించిన వాస్తవాలు అంటూ ఓ లింక్‍ను ట్వీట్‍ చేసింది. ఈ ట్వీట్‍పై ఆహ్రం వ్యక్తం చేసిన ట్రంప్‍ తమ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ట్విట్టర్‍ లాంటి సామాజిక మాధ్యమాలను నిషేధిస్తాం అంటూ ప్రకటించారు. దీనిపై ట్విట్టర్‍ సిఇవో జాక్‍ డొర్సి స్పందించారు. ట్విట్టర్‍ ద్వారా జరిగే చర్యలకు కంపెనీగా ఎవరైనా బాధ్యత వహించాల్సి వస్తే అది తాను మాత్రమేనని అన్నారు. తమ కంపెనీ ఉద్యోగుల జోలికి మాత్రం రావద్దని ట్రంప్‍కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు  ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల వ్వవస్థలో అసత్యాలు, వివాదాస్పద సమాచారంపై తమ పోరాటం కొనసాగుతుందని ట్రంప్‍ ఘాటుగా సమాధానమిచ్చారు. ఒకవేళ తాము ఏమైనా తప్పు చేసి ఉంటే దాన్ని అంగీకరిస్తామని ట్వీట్‍ చేశారు.