India looks to store cheap oil in United States says Dharmendra Pradhan

చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో అత్యవసర నిల్వలను పెంచుకుంటున్న భారత్‍ కొత్త సమస్య ఎదురవుతోంది. దేశంలో చమురు నిల్వ చేసేందుకు ఏర్పాటైన ప్రత్యేక వసతుల్లో చోటు సరిపోకపోవడంతో అమెరికాలో నిల్వచేసేందుకు భారత్‍ యోచిస్తున్నట్టు కేంద్ర మంత్రి థర్మేంధ్ర ప్రథాన్‍ తెలిపారు. చౌక ధరలో అందుబాటులోకి వస్తున్న చమురును ఇతర దేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో నిల్వచేసే అవకాశాన్ని మేము పరిశీలిస్తున్నాము అని తెలిపారు. ఆస్ట్రేలియా ఇప్పటికే అమెరికాలో చమురు నిల్వను ప్రారంభించింది. భారత్‍  కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ చమురు ధరలు దాదాపు 40 శాతం మేర దిగిపోయాయి. దీంతో అనేక దేశాలు అత్యవసర సందర్భాల కోసం చౌక ధరల్లో చమురును కొనుగోలు చేసి నిల్వచేసుకుంటున్నాయి. భారత్‍ ఇప్పటికే దాదాపు 5.3 మిలియన టన్నుల మేల అత్యవసర నిల్వలను సమకూర్చుకున్నదని, వివిధ దేశాల్లో మరో 9 మిలియన్‍ టన్నులను గల్ఫ్ దేశాల్లో నిల్వచేస్తోందని తెలిపారు.