పిట్ట కొంచెం కూత ఘనం!

11-06-2017

పిట్ట కొంచెం కూత ఘనం!

పూవు పుట్టగానే పరిమళిస్తుంది అలాగే కొందరు చాలా పిన్న వయసులోనే గుర్తింపులోకి వస్తారు. శ్రీజ సూరిశెట్టి ఆలాఎనిమిది, తొమ్మిది సంవత్సరాల లోపు చిన్నారి, అయినా కూచిపూడి నాట్యకళలో చక్కని అభినవేశంతో ఎంతో పేరుతెచ్చుకొంది. టేనస్సీ రాష్ట్రంలోనిమెంఫిస్ మహాపట్నంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఉత్తర అమెరికాలోనే సుప్రసిద్ధం. స్పిరిట్యుయల్ ఫౌండేషన్ వారి ఇండియన్ బాలే థియేటర్నిర్వహించే కూచిపూడి నృత్య శిక్షణాతరగతుల్లో గత మూడు సంవత్సరాలుగా డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్రప్రభ వాసిలి దంపతుల వద్దనృత్యాన్ని అభ్యసిస్తూ అనేక ప్రదర్శనలిచ్చింది శ్రీజ. శ్రీమతి శైలజ మరియు శ్రీ చంద్ర శేఖర్ సూరిశెట్టి దంపతుల ముద్దుల కుమార్తెలు శ్రీజ మరియుఈషా. అక్కాచెలెళ్ళు ఇద్దరు కూచిపూడి నృత్యాన్ని అభ్యసిస్తున్నప్పటికీ శ్రీజ వయస్సులో పెద్ద కారణంగా మూడు సంవత్సరాలుగా, ఈషా ఏడాదిపైగా నృత్యం నేర్చుకుంటున్నారు. ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ వారి హిందూ ఆలయంలో బ్రహ్మోత్సవాలు, శ్రీ రామనవమి వేడుకలు,కృష్ణాష్టమి, ఉగాది, దసరా, బతుకమ్మ పండుగలలో నృత్య ప్రదర్శనలిచ్చి ప్రేక్షకుల్ని మెప్పించిన చిన్నారులు వీళ్ళు. ఇండియా అసోసియేషన్ అఫ్మెంఫిస్ వారు నిర్వహించే ఇండియాఫెస్టివల్లో అలాగే తెలుగు అసోసియేషన్ అఫ్ మెంఫిస్ వారు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో సూరిశెట్టి సిస్టర్స్అద్భుతమైన ప్రదర్శనలిచ్చారు. కూచిపూడి పూర్వరంగం, జతిస్వరం, రామాయణ శబ్దం, తిల్లాన అలాగే అన్నమాచార్య పదాలైన కొలని దోపరికిగొబ్బిళ్ళో, అదివో అల్లదివో శ్రీ హరివాసము, కులుకాక నడువరో కొమ్మలారా, శ్రీ రామదాసు కీర్తనలు ఇదిగో భద్రాద్రి గౌతమీ అదిగో చూడండి, ఎంతోరుచిరా శ్రీరామ నీ నామ మెంతో రుచిరా, శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం వంటి శ్లోకాలు సునాయాసంగా అభినయించగలరు శ్రీజ మరియుఈషా సోదరీమణులు. ఇటీవల శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్వహించిన ద్వితీయ జీర్ణోధారణ కుంభాభిషేకం కూచిపూడి నృత్యాభిషేకంలో ఈసోదరీమణులు అనేక నృత్యంశాలు ప్రదర్శించే శెభాష్ అనిపించుకున్నారు!  

Dr. Ramana Vasili

President, Spiritual Foundation, Inc.
901-387-9646 ramanavvasili@hotmail.com
http://www.spiritualfoundation.us/