న్యూయార్క్ జూలో పులికి కరోనా

Bronx Zoo Tiger Is Sick With the Coronavirus

కరోనా వైరస్‍ మనుష్యులకే కాదు జంతువులకు కూడా సోకుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలోని బ్రాంక్స్ జూ చాలా పెద్దది. అందులో దాదాపు 6000కు పైగా వివిధ రకాల జంతువులు ఉన్నాయి. మార్చి 27న అక్కడ ఉన్న జంతువులలో 4 సంవత్సరాల పెద్దపులికి తీవ్రంగా జ్వరం రావడంతో పరీక్షలు చేయించగా, కరోనా వ్యాధి వచ్చినట్లు ఫలితం వచ్చింది. జూలో సింహం, పులి లాంటి జంతువుల దగ్గరకు సందర్శకులు వచ్చే అవకాశం లేదు కాబట్టి, ఆ పులికి ఆహారం పెట్టే ఉద్యోగి నుంచి పులికి కరోనా వచ్చిందా అన్న కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు కరోనా వ్యాధి జంతువులకు కూడా వస్తుందా?రాదా? అని శాస్త్రవేత్తలు వైద్యులు ఇంకా పూర్తిస్థాయి నిర్దారణ చేయలేదుకాని ముందు జాగ్రత్తగా అన్నీ జూలకు కట్టుదిట్టమైన భద్రతలు, జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించారు.

 


                    Advertise with us !!!