నిర్విఘ్నం కూచిపూడి నృత్యయజ్ఞం!

06-06-2017

నిర్విఘ్నం కూచిపూడి నృత్యయజ్ఞం!

కుంభాభిషేకం రంగస్థలం వేదికగా కదం తొక్కిన చిన్నారులు. ఆటల్లో, పాటల్లో హరివిల్లులోని ఒంపులు, ఇంద్ర ధనస్సు లోని సోంపు. సప్త వర్ణాలు రంగరించిన సోయగాలు. కొలువైతివా రంగ సాయిఅంటూ కొలువైన రంగ సాయిని చూడటానికి వేయి కళ్ళైనా చాలవని అభినయించిన యోగిత మానస డింతకుర్తి, ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు అంటూ యశోదకృష్ణులని ఆవిష్కరించిన నిధి నిహారిక చెన్నం మరియు వైష్ణవి పిల్లి అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసారు. అట్టి అయోధ్య పట్టణమున పట్టభద్రుడై ప్రబలిన రామా! అంటూ శ్రీజ సూరిశెట్టి, శైలిక మరియు పర్ణిక పగడాల శ్రీ రామ కథని కనుల విందుగా ప్రదర్శించారు. యోగిత మానస, శ్రీజ, శైలిక మరియు పర్ణిక ప్రదర్శించిన "తిల్లాన" బృంద నాట్యం కూచిపూడి నాట్య ప్రాశస్త్యాన్ని చాటి చెప్పింది.   

ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ వారి శ్రీ వెంకటేశ్వర ఆలయ ద్వితీయ కుంభాభిషేకం సాంస్కృతిక కార్యక్రమంరితిక పాగల, సహస్ర ససిపల్లి, రశ్మిత బయ్యన మరియు మేఘన బలభద్రుని ప్రదర్శించిన కూచిపూడి పూర్వరంగం"బ్రహ్మాంజలి" తో ప్రారంభమయింది.  ఈషా సూరిశెట్టి, సహస్ర తోట, శాంతి బాలెపు, శాన్వి కుంటమల్ల, అస్మిత బొడ్డుమరియు అశ్విక బండారు ప్రదర్శించిన  జతిస్వరం కూచిపూడి నృత్యంలో కొత్తనడకలు చూపింది. అన్నమయ్య కొలనిదోపరికి గొబ్బిళ్ళో, కులుకక నడువరో, అదివో అల్లదివో అలాగే రామదాసు కీర్తనలు ఇదిగో భద్రాద్రి గౌతమీ అదిగోచూడండి, శ్రీ రామ నీ నామ మెంతో  రుచిరా, శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం బృంద నృత్యాలుగా ప్రదర్శించిప్రేక్షకుల విశేష అభిమానాన్ని చూరగొన్నారు. కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ రమణ మరియు శ్రీమతి చంద్ర ప్రభవాసిలి ప్రదర్శించిన ఆనంద తాండవమాడే శివుడు చక్కటి ఆంగికాభినయంతోను, చక్కటి తాండవ మూర్తిహావభావాలతో అలరించారు.  ICCT శ్రీ వెంకటేశ్వర ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వహణాధికారి డాక్టర్ సుబ్బరాయప్రసాద్ దుగ్గిరాల కళాకారుల్ని మెమెంటోలతో సత్కరించారు.  ICCT Dance Academy వారు Spiritual Foundation వారి Indian Ballet Theater సహకారంతో కుంభాభిషేకంలో కూచిపూడి నృత్య యజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వించారు. 


Dr. Ramana Vasili
Spiritual Founation, Inc.
7062 S. Beringer Drive
Cordova, TN 38018
901-387-9646
ramanavvasili@hotmail.com

 

Click here for Event Gallery