డబ్ల్యూహెచ్వోపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్

09-04-2020

డబ్ల్యూహెచ్వోపై డొనాల్డ్ ట్రంప్ ఫైర్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍వో)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ విరుచుకుపడ్డారు. ఈ సంస్థ చైనా పక్షపాతిగా ఉంటోందని, కరోనా వైరస్‍ ఉద్ధ•తిపై స్పందించడంలో అవకాశాన్ని జారవిడుచుకుందని ఆరోపించారు. డబ్ల్యూహెచ్‍వోకు అమెరికా సమకూర్చాల్సిన నిధుల్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్‍ ప్రపంచ దేశాలకు విస్తరించకుండా అడ్డుకోవడంలో ఆ సంస్థ సకాలంలో మార్గనిర్దేశం చేయలేకపోయిందని మీడియా సమావేశంలో ఆయన నిందించారు. డబ్ల్యూహెచ్‍వోకు సింహ భాగం నిధుల్ని సమకూరుస్తున్నది అమెరికాయే. ప్రయాణపరమైన నిషేధాన్ని నేను విధించినప్పుడు వారు దానితో విభేదించి విమర్శించారు. అదొక్కటే కాకుండా చాలా విషయాల్లో వారు తప్పులు చేశారు. మొదటే వారి వద్ద చాలా సమాచారం ఉన్నా బయటపెట్టలేదు. అందుకు నిధుల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం అని వివరించారు.