ఆఫ్రికన్ సంతతి అమెరికన్లకే ఎక్కువ

09-04-2020

ఆఫ్రికన్ సంతతి అమెరికన్లకే ఎక్కువ

ఆఫ్రికా సంతతి అమెరికన్లలో కరోనా వైరస్‍ కేసులు ఎక్కువగా నమోదవుతుండటం పరిశోధకులకు మరో సవాలుగా మారింది. వారిలో ఎక్కువమందికి ఎందుకు వైరస్‍ సోకుతోందన్నదానిపై కచ్చితమైన ఆధారాలు ప్రస్తుతానికి లేవు. అమెరికా శస్త్రచికిత్సల విభాగాధిపతి (సర్జన్‍ జనరల్‍) జెరోమ్‍ ఆడమ్స్ ఈ పరిణామంపై స్పందించారు. ఆఫ్రికన్‍ సంతతి వారిలో చాలా మందికి సరైన పౌష్టికాహారం లేదని, వైద్య సదుపాయాలకూ వారు దూరంగానే ఉంటున్నారని చెప్పారు. వీళ్లు బయటిపనులు చేయకుని బతుకుతుంటారు. పైగా మధుమేహం, హృద్రోగం, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ముప్పు వీరికి ఎక్కువ. ఇలాంటి వారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు అని ఆడమ్స్ విశ్లేషించారు.