'బ్లాక్‌ అమెరికన్లే' కరోనా సమిథలు

09-04-2020

'బ్లాక్‌ అమెరికన్లే'  కరోనా సమిథలు

కరోనాతో అమెరికాలో సంభవిస్తున్న మరణాలను నిశితంగా పరిశీలిస్తే ఈ మహమ్మారికి ఎక్కువగా దేశంలోనే అనేక ప్రాంతాలలో బ్లాక్‍ అమెరికన్లే సమిథలుగా మారుతున్నారన్న విషయం సృష్టమవుతోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన తాజా సంచిక కథనంలో వ్యాఖ్యానించింది. ఈ వైరస్‍ తీవ్ర స్థాయిలో ప్రబలిన ప్రాంతాలకు సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్నే తేటతెల్లం చేస్తున్నాయని ఆ పత్రిక వివరించింది. లూసియానా రాష్ట్ర జనాభాలో బ్లాక్‍ అమెరికన్లు దాదాపు మూడో వంతు మంది వున్నారు.