భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు

09-04-2020

భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు

కోవిడ్‍-19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్‍ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్‍ డోస్‍లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ వెల్లడించారు. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరో క్విన్‍ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు అని ఫాక్స్ న్యూస్‍తో ట్రంప్‍ వ్యాఖ్యానించారు. అమెరికా హైడ్రాక్సీ క్లోరోక్విన్‍ను  ఎగుమతి చేసేందుకు భారత్‍ మంగళవారం అంగీకరించిన విషయం తెలిసిందే.