అరవిందో ఫార్మాపై అమెరికాలో వ్యాజ్యం

08-04-2020

అరవిందో ఫార్మాపై అమెరికాలో వ్యాజ్యం

మెట్‍ఫార్మిన్‍ మెడిసిన్‍లో ఎన్‍-నిట్రోసొడిమిథై లమిన్‍ అనే క్యాన్సర్‍ కారకం ఉందనే విషయాన్ని దాచిపెట్టిన కొన్ని ఔషధ కంపెనీలపై అమెరికా కోర్టులో ఏ క్లాస్‍ వ్యాజ్యం దాఖలైంది. కేసును ఎదుర్కొనున్న కంపెనీల్లో అరబిందో ఫార్మా, ఎమ్‍క్యూర ఫార్మాసిటికల్స్తో పాటు పలు ఔషధ కంపెనీలు ఉన్నాయి. ఎంఎస్‍పీ రివకరీ క్లెయిమ్స్ ఈ మేరకు ఏప్రిల్‍ 3న యూఎస్‍ డిస్ట్రిక్‍ కోర్ట్ ఫర్‍ ది సదరన్‍ డిస్రిక్ట్ ఆఫ్‍ ఫ్లోరిడాలో వ్యాజ్యం దాఖలైంది. చట్టవిరుద్దంగా క్యానర్స్ కారకం ఉందనే విషయాన్ని దాచడంతో మత చెల్లింపులను తిరిగి ఇచ్చేయాలని పిటిషన్‍దారు కోరారు. ఇదిలావుండగా వ్యాజ్యాన్ని ఎదుర్కొనున్న ఫార్మా కంపెనీల జాబితాలో అరబిందో ఫార్మా, ఎమ్‍క్యూర ఫార్మాసిటికల్స్ తో పాటు ఔరోలైఫ్‍ ఫార్మా, ఎల్‍ఎల్‍సీ, హెరిటేజ్‍ ఫార్మాసిటికల్‍స్‍ ఎల్‍ఎల్‍సీ ఉన్నాయి.