వాట్సాప్ కీలక నిర్ణయం

08-04-2020

వాట్సాప్ కీలక నిర్ణయం

మహమ్మారి కరోనా వైరస్‍ ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తుంటే మరోవైపు వాట్సాప్‍ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న కరోనా వదంతులు మరింత భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‍కు సంబంధించిన తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా అడ్డుకొనేందుకు వాట్సాప్‍ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటివరకు ఒక్కో మెసేజ్‍ను ఒకేసారి ఐదుగురికి షేర్‍ చేసేందుకు వీలుండేది. తాజా చర్యతో భారత్‍ సహా అన్ని దేశాల్లోని వాట్సాప్‍ యూజర్లు ఇకపై ఒక్కసారి ఒక్కరికే  షేర్‍ చేసేలా కట్టుదిట్టం చేసిందిన.. దీని వల్ల 25 శాతం మేరకు ఫేక్‍ న్యూస్‍ షేర్‍ చేయడం తగ్గుతుందని వాట్సాప్‍ సంస్థ భావిస్తున్నది.