16 లక్షల పరీక్షలు నిర్వహించాం : ట్రంప్

06-04-2020

16 లక్షల పరీక్షలు నిర్వహించాం : ట్రంప్

అమెరికాలో ఇప్పటి వరకు 16 లక్షల కరోనా వైరస్‍ నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ తెలిపారు. అక్కడ మృతుల సంఖ్య 10 వేల మార్క్ను చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో దాదాపు 95 శాతం జనాభాకు ఇంటికే పరిమితం కావాలన్న నిబంధనలు వర్తిస్తాయని గుర్తు చేశారు. అమెరికాలో మృతుల సంఖ్య 9,626కు చేరింది. 9/11 ఉగ్రదాడిలో చనిపోయిన వారితో పోలిస్తే ఇది మూడింతలు. ఆదివారం ఒక్కరోజే 1,188 మంది మృత్యువాతపడ్డారు. ఇక కొత్తగా దాదాపు 23 వేల మందిలో వైరస్‍ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైరస్‍ బారినపడ్డవారి సంఖ్య 3,36,958కి చేరింది.