భారత్ కు అమెరికా భారీ సాయం ...

06-04-2020

భారత్  కు అమెరికా భారీ సాయం ...

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‍కు అమెరికా భారీ సాయం ప్రకటించింది. 2.9 మిలియన్‍ డాలర్లు ఇవ్వనున్నట్టు అగ్రరాజ్యం వెల్లడించింది. యూఎస్‍ ఏజెన్సీ ఫర్‍ ఇంటర్నేషనల్‍ డెవలప్‍మెంట్‍ (యూఎస్‍ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు భారత్‍లో అమెరికా రాయబారి కెన్నెత్‍ జస్టర్‍ ఓ ప్రకనట చేశారు. కొవిడ్‍-19ను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సాయం భారత్‍కు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు సెంటర్‍ ఫర్‍ డిసీజ్‍ కంట్రోల్‍ అండ్‍ ప్రివెన్షన్‍ (సీడీసీ), యూఎస్‍ఏఐడీ వంటి సంస్థలు భారత్‍తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. గత 20 సంవత్సరాల్లో ఆరోగ్య రంగంలో 1.4 బిలియన్‍ డాలర్ల ఆర్థిక సాయాన్ని భారత్‍కు అమెరికా అందించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‍లో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా అమెరికా తోడ్పాటునందించనుందని చెప్పారు.