కరోనా బారిన పడ్డ న్యూయార్క్ గవర్నర్ సోదరుడు

02-04-2020

కరోనా బారిన పడ్డ న్యూయార్క్ గవర్నర్ సోదరుడు

తన తమ్ముడు, సీఎన్‍ఎన్‍ టీవీ న్యూస్‍ యాంకర్‍ క్రిస్‍ క్యూమో మహమ్మారి కరోనా బారిన పడ్డారని న్యూయార్క్ గవర్నర్‍ ఆండ్రూ క్యూమో తెలిపారు. ప్రాణాంతక వైరస్‍ ఎవరికైనా సోకుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‍లో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. నా చిట్టి తమ్ముడిని రక్షించుకోలేకపోతున్నా. తనను తాను కూడా కాపాడుకోలేడు. ఇది చాలా భయంకరంగా ఉంది. తన పరిస్థితి గురించి ఆందోళనగా ఉంది. మనం ప్రేమించే వాళ్లకు  ఇలా జరిగితే అందరం ఇలాగే విచారిస్తాం కదా. తమ్ముడు ఐ లవ్‍ యూ. ధైర్యంగా ఉండు అని ఆండ్రూ ఉద్వేగభరిత ట్వీట్‍ చేశారు.