కరోనా టెస్టుల్లో జర్మనీ భేష్

02-04-2020

కరోనా టెస్టుల్లో జర్మనీ భేష్

కరోనా వైరస్‍ టెస్టులు చేయడంలో జర్మనీ ఫస్ట్ అని చెప్పవచ్చు.  మాత్రం దైనందిన జీవితంలో ఓ భాగంగా తీసుకుంది. పశ్చిమ జర్మనీలో సుమారు 78 వేల మందికి కరోనా సోకితే అందులో కేవలం 931 మంది మాత్రమే చనిపోయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తం కావడమే. ప్రతి రోజూ కనిపించిన వారికల్లా కరోనా పరీక్షలు చేసేస్తున్నారు. ప్రతి సెంటర్‍లోనూ కరోనా టెస్టింగ్‍ కిట్లతో ఆరోగ్య శాఖ సిబ్బంది సిద్ధంగా ఉంటున్నారు. తమ సమీపంలోకి ఎవరు వచ్చినా వెంటనే పరీక్ష నిర్వహించి కరోనా సోకితే ఐసోలేషన్‍ సెంటర్‍కు తరలించేస్తున్నారు.

ఆఖరికి కారులో వచ్చిన వారు దిగకుండానే క్షణాల్లో టెస్ట్ చేసి నిర్ధారించడం కనిపిస్తోంది. అంతేకాకుండా ఇటలీ నుంచి కూడా కొందరు కరోనా సోకిన వారిని తమ దేశంలోకి రప్పించి వారికి ట్రీట్‍మెంట్‍ ఇప్పిస్తున్నారు. ది గ్రేట్‍ బ్రిటన్‍లో వారానికి 50 వేల పరీక్షలు నిర్వహిస్తుంటే జర్మనీలో కేవలం ఒక్కరోజులోనే లక్ష మందికి పరీక్షలు నిర్వహించడం నిజంగా అబ్బురమే. రెండు దేశాలు వైద్య రంగంలో అద్భుతాలు సాధించినా జర్మనీ క్షేత్రస్థాయిలోనే సత్తా చాటుతోంది. జర్మనీలో సైనిక ఆపరేషన్‍గా కరోనా పరీక్షలు నిర్వహిస్తుండడం కూడా విశేషం. ప్రతి రంగం ఇప్పుడు కరోనా పరీక్షలపైనే శ్రద్ధ పెట్టాయి. పశువైద్యశాలల్లో కూడా లాబోరేటరీలు ఇప్పుడు నిరంతరాయంగా కరోనా పరీక్షలనే జరుపుతున్నాయి. దీన్ని బట్టి జర్మనీ కరోనా నివారణ, నియంత్రణకు జర్మనీ దేశం ఎంత ప్రాముఖ్యతనిచ్చి శ్రద్ధ పెట్టిందో అర్ధమవుతోంది.

మొదట్లో వారానికి లక్ష పరీక్షలు నిర్వహించిన జర్మనీ ఇప్పుడు ప్రతి రోజు సుమారు లక్ష పరీక్షలు నిర్వహిస్తోంది. ఐసోలేషన్‍, ఐసీయూ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది.