అమెరికాకు చైనీయుల సాయం

02-04-2020

అమెరికాకు చైనీయుల సాయం

కరోనా వైరస్‍పై పోరులో అమెరికాకు అక్కడి చైనీయులు, చైనా సంస్థలు ఇతోధికంగా సాయాన్ని అందిస్తున్నాయి. అమెరికాలో 115కి పైగా వున్న చైనీస్‍ అమెరికన్‍ రెస్టారెంట్‍ యాజమాన్యాలు 72 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించాయి. దీంతోపాటు న్యూయార్క్లోని అనేక ఆస్పత్రులకు 20 వేల సర్జికల్‍ మాస్క్లు, గ్లౌజులు, గౌనులు ఇతర పరికరాలను అందచేసినట్లు చైనీస్‍ అమెరికన్‍ రెస్టారెంట్ల ప్రతినిధి విక్కీ వాంగ్‍ చెప్పారు. అమెరికాలో వున్న చైనా కంపెనీలు పలు ఆస్పత్రులకు ఔషధాలు, వైద్య పరికరాలను అందజేసేందుకు ముందుకొచ్చాయి.