అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి

02-04-2020

అమెరికాలో ఇద్దరు భారతీయులు మృతి

అమెరికాలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్‍ తాజాగా ఇద్దరు భారతీయుల ఉసురు తీసింది. న్యూయార్క్ లో  కేరళకు చెందిన థామస్‍ డేవిడ్‍ (43), న్యూజెర్సీలో ఎర్నాకులానికి చెందిన 85 ఏళ్ల కుంజమ్మ శామ్యూల్‍ కరోనా వైరస్‍ సోకి మృతి చెందారు. మరోవైపు ఇరాన్‍, ఇటలీ, స్పెయిన్‍ దేశాలలో ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు భారతీయులు కరోనా వైరస్‍ సోకి మరణించారు. దాంతో విదేశాలలో కరోనా తాకిడితో మృతి చెందిన వారి సంఖ్య 5 కు చేరింది.