మెకెన్రో తమ్ముడికి కరోనా

02-04-2020

మెకెన్రో తమ్ముడికి కరోనా

ప్రఖ్యాత టెన్నిస్‍ వ్యాఖ్యాత, ఫ్రెంచ్‍ ఓపెన్‍ మాజీ డబుల్స్ విజేత ప్యాట్రిక్‍ మెకెన్రోకి కరోనా వైరస్‍ సోకింది. వైద్య పరీక్షల్లో తనకి కరోనా పాజిటివ్‍గా నిర్ధారణ అయిందని ప్యాట్రిక్‍ స్వయంగా ట్విటర్‍లో తెలిపారు. పాట్రిక్‍ టెన్నిస్‍ లెజెండ్‍ జాన్‍ మెకెన్రో తమ్ముడు. ఈ 53 ఏళ్ల అమెరికన్‍ 1989లో ఫ్రెంచ్‍ ఓపెన్‍ డబుల్స్ టైటిల్‍ నెగ్గాడు. 1991లో ఆస్ట్రేలియా ఓపెన్‍ సెమీస్‍ చేరాడు.