అమెరికాలో వైద్యులు, సిబ్బందికి ఉచిత బస

అమెరికాలో వైద్యులు, సిబ్బందికి ఉచిత బస

25-03-2020

అమెరికాలో వైద్యులు, సిబ్బందికి ఉచిత బస

అమెరికాలోని కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా తమ హోటళ్లలో ఉచిత బస కల్పించనున్నట్లు భారతీయ హోటల్‍ చైన్‍ స్టార్టప్‍ ఓయో ప్రకటించింది. వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓయో హోటల్స్ అండ్‍ హోమ్స్ వ్యవస్థాపకుడు రితేశ్‍ అగర్వాల్‍ తెలిపారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కుమార్తె ఇవాంక హర్షం వ్యక్తం చేశారు. మంచిని కోరే ఇలాంటి చర్యలు ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుందని ట్వీట్‍ చేశారు.