కరోనా కోరల్లో అమెరికా

కరోనా కోరల్లో అమెరికా

25-03-2020

కరోనా కోరల్లో అమెరికా

 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‍  అమెరికాలో ఎక్కువైంది.  ఆ దేశంలో కోవిడ్‍ బాధితుల సంఖ్య 50 వేలకు పైగా చేరుకుంటోంది. వందలాదిమంది ఈ వైరస్‍ కారణంగా తమ ప్రాణాలను కోల్పోయారు. మరోవైపు మాస్కులు, శానిటైజర్లు ఇతర మందులను నిల్వ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు ట్రంప్‍  ఆదేశాలు జారీ చేశారు. అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసినా శిక్ష తప్పదన్నారు. న్యూయార్క్ ప్రస్తుతం కోవిడ్‍కు కేంద్రబిందువుగా మారింది. అమెరికాలో కోవిడ్‍ బారిన పడ్డ ప్రతి ఇద్దరిలో ఒక్కరు న్యూయార్క్కు చెందిన వారే.  న్యూయార్క్ నగరం, మెట్రో ఏరియా, న్యూజెర్సీ, లాండ్‍ ఐలాండ్‍ ప్రాంతాల్లో ప్రతి వెయ్యిమందిలో ఒకరు వ్యాధి బారిన పడ్డారని వైట్‍హౌస్‍లో కరోనా టాస్క్ఫోర్స్ అధికారి డెబ్రా ఎల్‍ బ్రిక్స్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా వైరస్‍ ప్రభావం ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్‍ స్టేట్‍, కాలిఫోర్నియాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, తగినని మందులు, ఇతర పరికరాలను అక్కడకు పంపిస్తున్నామని తెలిపారు. ఫెడరల్‍ ఎమర్జెన్సీ ఏజెన్సీ సుమారు 80 లక్షల ఎన్‍ 95 మాస్కులను పంపిణీ చేస్తోందని, కోటీ 33 లక్షల సర్జికల్‍ మాస్కులూ అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్‍ 19పై ప్రభావం చూపే మందుల కోసం పరిశోధనలు ముమ్మరం చేశామని, క్లోరోక్వైన్‍ వంటి యాంటీ మలేరియా మందుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.