ప్రిన్స్ చార్లెస్ కు కరోనా వైరస్

ప్రిన్స్ చార్లెస్ కు కరోనా వైరస్

25-03-2020

ప్రిన్స్ చార్లెస్ కు కరోనా వైరస్

యువరాజు చార్లెస్‌కు కరోనావైరస్ సోకినట్లు చార్లెస్ హౌస్ ధ్రువీకరించింది.71 ఏళ్ళ ప్రిన్స్ చార్లెస్‌లో స్వల్పంగా కరోనావైరస్ లక్షణాలు కనిపించాయని పేర్కొంటూనే  ఆయన ఆరోగ్యం బాగుందని చార్లెస్ హౌస్  అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.  ఆయన స్కాట్‌ల్యాండ్‌లోని తన నివాసంలో స్వీయ నిర్భందంలో ఉన్నారని క్లారెన్స్‌ హౌస్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రిన్స్ చార్లెస్ భార్య డచెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు.అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారణ అయింది.బ్రిటన్ రాణి తన కుమారుడిని మార్చి 12న చివరిసారిగా కలిశారని, ఆమె ఆరోగ్యంతో ఉన్నారని   బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది.