అమెరికా ప్రథమ మహిళకు కరోనా పరీక్ష!

అమెరికా ప్రథమ మహిళకు కరోనా పరీక్ష!

24-03-2020

అమెరికా ప్రథమ మహిళకు కరోనా పరీక్ష!

అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‍కు కరోనా వైరస్‍ (కొవిడ్‍-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్‍ వచ్చిందని శ్వేతసౌధం సిబ్బంది వెల్లడించారు. మెలానియా ఆరోగ్యంగానే ఉంది అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ప్రకటించారు. కాగా, ట్రంప్‍కు కూడా మార్చి 13న కరోనా పరీక్షను నిర్వహించటం దానిలో నెగిటివ్‍ రావటం తెలిసిందే. ఆయన భార్య మెలానియాకు కూడా అదే రోజు పరీక్షలు నిర్వహించారు. ఈ రోజు ఫలితాన్ని వెల్లడించారు.