షావోమి ‘ఎన్95’ మాస్కుల పంపిణీ

షావోమి ‘ఎన్95’ మాస్కుల పంపిణీ

24-03-2020

షావోమి ‘ఎన్95’ మాస్కుల పంపిణీ

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‍ హ్యాండ్‍సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ ఎన్‍ 95 మాస్క్లను పంపిణీ చేస్తోంది.  భారత్‍లోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు, పోలీసులకు అత్యంత నాణ్యత కలిగిన ఈ ఎన్‍95 మాస్కులను పంపిణీ చేస్తోంది. వైరస్‍ కారణంగా వీటి ధర 18 రెట్లు వరకు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఈ మాస్కులను ఉచితంగా పంపిణీ చేస్తూ కంపెనీ తన దాత•త్వాన్ని చాటుకుందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వాలకు ఈ వారంలో మాస్కులు, రక్షణ జాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‍ డైరెక్టర్‍ మను జైన్‍ ఉద్యోగులకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.