హాలీవుడ్ నిర్మాతకు కరోనా

హాలీవుడ్ నిర్మాతకు కరోనా

24-03-2020

హాలీవుడ్ నిర్మాతకు కరోనా

హాలీవుడ్‍లో మీటూ ఉద్యమం ద్వారా జైలుపాలైన ప్రముఖ నిర్మాత హార్వీ వైన్‍స్టీన్‍ కరోనా బారిన పడ్డారు. మీటూ సమయంలో 68 ఏళ్ల హార్వీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడ్డారంటూ పలువురు తారలు వెల్లడించారు. న్యాయస్థానంలో ఆయనపై ఆరోపణలు రుజువు కావడంతో 23 ఏళ్ల కారాగార శిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే జైల్లోనే హార్వీకి కరోనా సోకినట్లు తేలిందని, దీంతో ఆయన్ను నిర్బంధంలో ఉంచామని మైఖేల్‍ పొవర్స్ అనే అధికారి తెలిపారు. ఈ సంఘటనతో ముందు జాగ్రత్త చర్యగా కొందరు జైలు అధికారులను కూడా నిర్బంధంలో ఉంచినట్లు చెప్పారు.