కాబూల్‍కు అమెరికా విదేశాంగ మంత్రి

కాబూల్‍కు అమెరికా విదేశాంగ మంత్రి

24-03-2020

కాబూల్‍కు అమెరికా విదేశాంగ మంత్రి

గత నెలలో తాలిబన్లతో కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అమలుకు సంబంధించిన చర్యలు చేపట్టే పక్రియను ప్రారంభించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‍ పాంపియో ఆప్ఘన్‍ రాజధాని కాబూల్‍కు చేరుకున్నారు. కరోనా వైరస్‍ ఉధృతికి ప్రపంచ ప్రముఖులందరూ తమ పర్యటనలను రద్దు చేసుకుంటున్న సమయంలో పాంపియో ఈ పర్యటనకు బయల్దేరటం గమనార్హం. గత సెప్టెంబర్‍లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్‍ ఘనీ, ఆయన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లా తామే దేశాధ్యక్షులమని ప్రకటించుకుంటూ ఈ నెలారంభంలో పోటీ ప్రమాణస్వీకారోత్సవాలు జరిపిన విషయం తెలిసిందే.