అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు

అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు

24-03-2020

అమెరికాలో పెరుగుతున్న కరోనా మరణాలు

చైనా, ఇటలీ తరువాత కరోనా బాధితులు అత్యధికంగా ఉన్న దేశం అమెరికానే. ఇప్పుడు అక్కడ 33546 మంది కరోనా పాజిటివ్‍ వ్యక్తులు ఉన్నారు. మృతుల సంక్‍య 419. అయితే, ఒక్క రోజు వ్యవధిలో 100 మరణాలు చోటు చేసుకోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ చైనాపై నిప్పులు కురిపించారు. సకాలంలో చైనా తమతో సమాచారం పంచుకోని కారణంగానే ఈ మహమ్మారి విజృంభిస్తోందని ఆరోపించారు. మొదట్లోనే చైనా ఈ వైరస్‍ గురించి తమకు సమచారం అందించి ఉంటే బాగుండేదని, చైనా వైఖరి తమకు అసంతృప్తి కలిగించిందని అన్నారు. కానీ తాను చైనాలా ఎప్పటికీ వ్యవహరించబోనని ట్రంప్‍ సృష్టం చేశారు. కాగా, అమెరికాలో పలు రాష్ట్రాలు లాక్‍డౌన్‍లోకి వెళ్లిపోయాయి. అత్యధికులు ఇళ్లకే పరిమితమయ్యారు.