ట్రంప్ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనేట్లో చుక్కెదురు

ట్రంప్ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనేట్లో చుక్కెదురు

24-03-2020

ట్రంప్ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి సెనేట్లో చుక్కెదురు

కరోనా నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్‍ సర్కారు ప్రతిపాదించిన ట్రిలియన్‍ డాలర్ల ప్యాకేజీకి సెనేట్‍లో చుక్కెదురైంది. డెమోక్రాట్ల నుంచి దీనికి మద్దతు లభించలేదు. అలాగే అధికార రిపబ్లికన్‍ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు క్యారంటైన్‍లో ఉండడం వల్ల ఓటింగ్‍లో పాల్గొనలేదు. ప్రస్తుత సంక్షోభం సమయంలో లక్షలాది మంది ప్రజలను రక్షించడంలో, వైద్యారోగ్య వ్యవస్థను మెరుగుపరచడంలో రిపబ్లికన్ల ప్రణాళిక విఫలమైందని డెమోక్రాట్లు విమర్శించారు.