అనన్యకు అరుదైన గౌరవం

27-02-2020

అనన్యకు అరుదైన గౌరవం

హైదరాబాద్‍ సెంట్రల్‍ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్‍ మాస్టర్స్ పోగ్రాం బయాలజీ విద్యార్థి అనన్యకు అరుదైన గౌరవం లభించినట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా నేషనల్‍ యూనివర్సిటీ వ్యూచర్‍ రిసెర్చ్ టాలెంట్‍ అవార్డు 2020కు ఎంపికయ్యారన్నారు. సిస్టమ్స్ అండ్‍, కంప్యూటేషన్‍ బయాలజీ విభాగం నామినేట్‍ చేసిన విద్యార్థుల్లో అనన్య కూడా ఒకరు. ఆమె 2020 మేలో ప్రొఫెసర్‍ థామస్‍ ప్రిస్‍ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని నేషనల్‍ యూనివర్సిటీలోని జాన్‍ కర్టిన్‍ స్కూల్‍ ఆఫ్‍ మెడికల్‍ రిసెర్చ్లో అండర్‍ గ్రాడ్యుయేట్‍ పరిశోధన శిక్షణ కోసం వెళ్తారు. ఆమె గత మూడేళ్లలో హైదరాబాద్‍ వర్సిటీలో సమ్మర్‍ ఇంటర్‍షిప్‍ కూడా పూర్తిచేసుకున్నారని వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.