1.3 లక్షల డాలర్ల ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లు

1.3 లక్షల డాలర్ల ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లు

27-02-2020

1.3 లక్షల డాలర్ల ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లు

గత ఏడాది డిసెంబర్‍లో విదేశీ డిపాజిట్లు పెరిగాయి. అధికారిక గణాంకాల ప్రకారం నవంబర్‍లో 1,32,669 మిలియన్‍ డాలర్ల ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లు వచ్చి చేరగా, డిసెంబర్‍లో ఆ మొత్తం 1,33,135 మిలియన్‍ డాలర్లుగా నమోదైంది. 2018 డిసెంబర్‍లో ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లు 1,25,733 మిలియన్‍ డాలర్లు. గత ఏడాది జనవరిలో 1,25,204 మిలియన్‍ డాలర్లు చేరుకోగా, ఫిబ్రవరిలో మరికొంత పెరిగి, 1,25,599 డాలర్లకు చేరింది. మార్చి మాసంలో 1.30 లక్షల మిలియన్‍ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఆ మాసంలో 1,30,423 మిలియన్‍ డాలర్లు డిపాజిట్లు రాగా, ఏప్రిల్‍లో 1,30,90 మిలియన్‍ డాలర్లుగా నమోదైంది. ఈ పెరుగుదల జూన్‍ మసంలోనూ కొనసాగింది. 1,33,586 మిలియన్‍ డాలర్లతో అత్యదిక డిపాజిట్లు వచ్చాయి.

ఆగస్టు మాసంలో 1,30,518 మిలియన్‍ డాలర్లు, సెప్టెంబర్‍లో 1,32,882 మిలియన్‍ డాలర్లు, అక్టోబర్‍లో 1,33,720 మిలియన్‍ డాలర్లు చొప్పున ఎన్‍ఆర్‍ఐ డిపాజిట్లను భారత్‍ సేకరించగలిగింది.నవంబర్‍లో 1,32,699 మిలియన్‍ డాలర్ల డిపాజిట్లు రాగా, డిసెంబర్‍లో 1,33,135 మిలియన్‍ డాలర్లు డిపాజిట్ల రూపంలో వచ్చాయి. ఈ ఏడాది మరింతంగా పెరుగుతాయని విశ్లేషకులు ధీమాతో ఉన్నారు.