అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించాలి : బెర్నీ శాండర్స్

అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించాలి : బెర్నీ శాండర్స్

27-02-2020

అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించాలి :  బెర్నీ శాండర్స్

టెల్‍అవీవ్‍లోనే యూఎస్‍ ఎంబసీని తిరిగి ఏర్పాటు చేస్తామని వెర్మాంట్‍ సెనెటర్‍, డెమోక్రాటిక్‍ పార్టీ ఆశావహ అధ్యక్ష అభ్యర్థి బెర్నీ శాండర్స్ ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ 2018లో యూఎస్‍ దౌత్య కార్యాలయాన్ని ఇజ్రాయిల్‍ నుంచి జెరూసలేమ్‍కు తరలించి అతిపెద్ద తప్పు చేశారని అన్నారు. ట్రంప్‍ నిర్ణయం అనంతరం మధ్యప్రాఛ్యం అగ్నిగుండంగా మారిపోయిందన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించినట్టయితే యూఎస్‍ ఎంబసీని మళ్లీ టెల్‍అవీవ్‍కు తరలిస్తామని బెర్నీ శాండర్స్ భరోసా ఇచ్చారు.