ఫెడరల్‍ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్‍

ఫెడరల్‍ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్‍

20-02-2020

ఫెడరల్‍ కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్‍

అమెరికాకు చెందిన ప్రవాస భారతీయ న్యాయమూర్తి శ్రీనివాసన్‍ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫెడరల్‍ సర్క్యూట్‍ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తద్వారా ఆ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు సృష్టించారు. భారత్‍లో హైకోర్టుల స్థాయిలో అమెరికాలో సర్క్యూట్‍ కోర్టులు ఉంటాయి. సుప్రీంకోర్టు తర్వాత శక్తిమంతమైన కోర్టులుగా వీటిని పరిగణిస్తారు. ఈ కోర్టుల పరిధిలో కొన్ని నగరాలు లేదా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి. శ్రీనివాసన్‍ (52) యూస్‍ కోర్ట్ ఆఫ్‍ అప్పీల్స్ ఫర్‍ ద డిస్ట్రిక్ట్ ఆఫ్‍ కొలంబియా సర్క్యూట్‍ (డీసీ సర్క్యూట్‍ అప్పీల్స్ కోర్టు) ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ నెల 12న ఆయన బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాసన్‍కు అమెరికా న్యాయ వ్యవస్థలో మంచి పేరున్నది.