న్యూయార్క్ లో తానా యోగా-మెడిటేషన్ కార్యక్రమం

న్యూయార్క్ లో తానా యోగా-మెడిటేషన్ కార్యక్రమం

19-02-2020

న్యూయార్క్ లో తానా యోగా-మెడిటేషన్ కార్యక్రమం

న్యూయార్క్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో యోగా, మెడిటేషన్‍ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తానా నాయకులు తెలిపారు. న్యూయార్క్ లోని న్యూహైడ్‍ పార్క్ క్లింటన్‍ జి మార్టిన్‍ పార్క్ కమ్యూనిటీ హాల్‍లో ఈ కార్యక్రమం జరగనున్నది. సూర్యనమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ముద్ర, మెడిటేషన్‍ కార్యక్రమాలను ఇందులో చేయనున్నారు. గురు సంజయ్‍ అత్తాడ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ రావాలని తానా నాయకులు కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం న్యూయార్క్ రీజినల్‍ కో ఆర్డినేటర్‍ సుమంత్‍ రామ్‍సెట్టిని (917 399 0459), ఉమెన్‍ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ శిరీష తూనుగుంట్ల (904 294 5655), కమ్యూనిటీ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍ మల్లివేమనను సంప్రదించవచ్చు. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది.