అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో విజేతగా ముంబాయి డ్యాన్స్ గ్రూప్

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో విజేతగా ముంబాయి డ్యాన్స్ గ్రూప్

19-02-2020

అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో విజేతగా ముంబాయి డ్యాన్స్ గ్రూప్

అమెరికాలో ప్రఖ్యాత అమెరికాస్‍ గాట్‍ టాలెంట్‍: ది చాంపియన్స్ షో (ఏజీటీ) రెండో సీజన్‍లో ముంబయికి చెందిన వి అన్‍బీటబుల్‍ డ్యాన్స్ గ్రూప్‍ విన్నరన్‍ నిలిచింది. ఈ డ్యాన్స్ గ్రూప్‍లోని 29 మందిలో చాలా వరకు ముంబయిలోని స్లమ్స్కు చెందిన పేదవారేనని పోటీ నిర్వాహకులు వెల్లడించారు. వి ఆన్‍బీటబుల్‍ డ్యాన్స్ గ్రూప్‍ అద్వితీయమైన ప్రదర్శన ఇచ్చిందని ప్రశంసించారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి.. ముంబయికి చెందిన ఈ డ్యాన్స్  గ్రూప్‍ మొదట్లో ఇండియాలో వివిధ సంస్థలు నిర్వహించిన చాలా డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. డ్యాన్స్ ప్లస్‍ 4, ఇండియా బనేగా మంచ్‍ వంటి పోటీల్లో గెలిచింది. అమెరికాస్‍ గాట్‍ టాలెంట్‍ షోలో కూడా గత ఏడాది ఈ గ్రూప్‍ పాల్గొని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఏకంగా విన్నర్‍గా నిలిచింది.