భారతీయులుకు గూగుల్ షాక్

19-02-2020

భారతీయులుకు గూగుల్ షాక్

గూగుల్‍ స్టేషన్‍ పేరుతో భారత్‍లోని రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందిస్తున్న గూగుల్‍ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పోగ్రాంను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో ఇంటర్నెట్‍ ధరలు చవకగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‍ వైస్‍ ప్రెసిడెండ్‍ సీజర్‍ గుప్తా తెలిపారు. ప్రస్తుతం భారత్‍లో ఇంటర్నేట్‍ సేవలు చవకగా మారిపోయాయి. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఐదేళ్ల క్రితం గూగుల్‍ స్టేషన్లు ప్రారంభించినప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నేట్‍ సులభతరంగా, చవకగా మారింది. మొబైల్‍ డేటా ప్లాన్లు తక్కువ రేట్లకు అందుబాటులోకి వచ్చాయి. మొబైల్‍ కనెక్టివిటీ భారీగా పెరిగిపోయింది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకు భారత్‍లో మొబైల్‍ డేటా లభ్యమవుతోంది. అప్పటితో పోలిస్తే మొబైల్‍ డేటా ధర 95 శాతం తగ్గిందని ఆయన వెల్లడించారు. ట్రాయ్‍ గణాంకాల ప్రకారం దేశంలోని వినియోగదారులు నెలకు సగటున 10 జిబి డేటాను వినియోగిస్తున్నారు. ఈ గణాంకాలన్నింటినీ పరిశీలించాకే గూగుల్‍ ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఇకనుంచి రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ఉండబోవు. ఇది రైల్వే ప్రయణికులకు కాస్త చేదు వార్తే.