స్టూడెంట్ కు డొనాల్డ్ ట్రంప్ షాక్

స్టూడెంట్ కు డొనాల్డ్ ట్రంప్ షాక్

19-02-2020

స్టూడెంట్ కు డొనాల్డ్ ట్రంప్ షాక్

అమెరికాలో చదవాలనుకుంటున్న విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్‍ ప్రభుత్వం షాక్‍ ఇవ్వనుంది. విద్యార్థి వీసాలకు నిర్దిష్ట కాలావధి నిర్ణయించనుంది. ఇప్పటిదాకా వారి డిగ్రీ పూర్తయ్యేదాకా వీసా ఉండేది. అది పూర్తయ్యాక అనుబంధ డిగ్రీ పట్టా సాధించుకునేందుకు పొడిగింపు కూడా ఇచ్చే వారు. ఇకపై లా కుదరదు. వీసా ప్రారంభం తేదీ, ముగింపు అని దరఖాస్తులో సృష్టంగా పేర్కొంటున్నారు. ఆ ముగింపు తేదీలోగా పెట్టే బేడా సర్దుకుని వచ్చేయాలి. చాలా మంది విద్యార్థులు తమ చదవు పూర్తి చేసుకున్నాక కూడా వేరే వీసాలకు మారకుండా అదే వీసాలపై కొనసాగుతుండడంతో ఈ కొత్త రూల్‍ తెచ్చారు. దీన్ని ఇమిగ్రేషన్‍ ఏజెన్సీలు తప్పుబడుతున్నాయి.