సచిన్ కు అరుదైన పురస్కారం

సచిన్ కు అరుదైన పురస్కారం

19-02-2020

సచిన్ కు అరుదైన పురస్కారం

భారత క్రికెట్‍ దిగ్గజం సచిన్‍ టెండూల్కర్‍కు మరో అరుదైన గౌరవం దక్కింది. 2011 వన్డే ప్రపంచకప్‍  నెగ్గిన తర్వాత భారత క్రికెటర్లు తమ స్టార్‍ క్రికెటర్‍ సచిన్‍ టెండూల్కర్‍ను భుజాలపై ఎత్తుకుని మైదానంలో ఊరేగించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను సచిన్‍కు ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది. లారస్‍ స్పోర్టింగ్‍ మొమెంట్‍ 2000-2020 అవార్డును సచిన్‍ సొంతం చేసుకున్నాడు. లారస్‍ స్పోర్టింగ్‍ అవార్డుల ప్రధానోత్సవంలో సచిన్‍కు అత్యధిక ఓట్లు లభించాయి. దీంతో అతనికి ప్రతిష్టాత్మకమైన లారస్‍ స్పోర్టింగ్‍ అవార్డు వరించింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెట్‍ దిగ్గజం స్టీవ్‍వా సచిన్‍ టెండూల్కర్‍ ఈ అవార్డును బహుకరించారు. స్టీవ్‍వా చేతుల మీదుగా సచిన్‍ అవార్డుకు సంబంధించిన ట్రోపీని అందుకున్నాడు.