సీఎం కేసీఆర్ కు మహేశ్ బిగాల శుభాకాంక్షలు

18-02-2020

సీఎం కేసీఆర్ కు మహేశ్ బిగాల శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారౖులు ఘనంగా నిర్వహించారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు హైదరాబాద్‌లో ఉన్న ఎన్నారైలతో కలిసి మహేష్‌ బిగాల మొక్కలు నాటారు. అనంతరం మహేష్‌ బిగాల ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కెనడా ప్రెసిడెంట్‌ కృష్ణ, ఒమాన్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌, లండన్‌ రమేష్‌ ఇసంపల్లి, అరవింద్‌ రెడ్డి, సౌదీ అరేబియా నుంచి మహహ్మద్‌ హమీద్‌, అమెరికా నుంచి నవీన్‌ జలగం పాల్గొన్నారు. మహేష్‌ బిగాల పిలుపు మేరకు 40 దేశాల్లో ఎన్నారై విభాగాలు మొక్కలు నాటి, కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్నారు.